Description
Lohanadi | Collection of Poems by Vaseera
First published in 1989.
వసీరా చాలా మృదువైన కవి, తడివున్న కవి; బలమైనకవి – గొప్ప ఊహాశాలి; మృదువుగా మనల్ని అల్లుకుని, మనల్ని మండిస్తాడు. ఒక్కోసారి గొప్ప వ్యంగ్యంతో ఖడ్గాన్ని అలా చాలా బలంగా విసురుతాడు; ఒక స్పష్టమైన రాజకీయ వైఖరి గల కవి. రాజకీయాల్ని కవిత్వాన్కి ఎలా ఎరువుగా వాడుకోవాలో తెలిసిన కవి. లాలిత్యం తెలిసిన కవి. లోతైన కవి. జీవితంలో వున్న అనంత వైవిధ్యాన్ని పట్టుకుంటున్న కవి. క్రమక్రమంగా వికసిస్తున్న కవి. నిదానంగా అడుగులేసుకుంటూ తన దోవ తను నిర్ణయించుకుంటున్న కవి. ఎంతో మృదువుగా ఊహిస్తాడు. ఎంతో వ్యంగ్యంగా పలుకుతాడు; మానవ సంబంధాలన్నీ ప్రేమానురాగాలన్నీ మాయమయిపోతున్న దశలో మూలాలు కనుక్కున్న కవి – జీవన అంతస్సారాన్ని పట్టుకుంటాన్కి ప్రయత్నిస్తున్న కవి. ఒక స్పష్టమైన కృషి, తనదైన గొప్ప ఊహాశక్తి, నేర్పూ ఉన్న కవి.
– కె. శివారెడ్డి








Reviews
There are no reviews yet