Sale!

Enugamma Enugu

Original price was: ₹200.00.Current price is: ₹195.00.

SKU: 9788197454363 Categories: , Brand:

Description

Enugamma Enugu – Vaseera’s Poetry

“నీ గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకో” అన్నారు అజు పబ్లికేషన్స్ వారు. నిజం చెప్పాలంటే నేనేంటో చెప్పుకునే ప్రయత్నంలో భాగమే ఈ యాతనంతా. యీ పొయెటిక్ జర్నీ అంతా నాలో నేనూ నా సమూహాలూ ఉన్నాం. ఒక్కోసారి నేనే గొంతెత్తి అరిచా. ఒక్కోసారి వాళ్లు తమని వ్యక్తం చేసుకున్నారు. నాకేమీ సంబంధం లేదు. ఒక్కోసారి తెలిసీ తెలియని అమాయకత్వంలోంచి, ప్రాపంచిక అజ్ఞానంలోంచి, నిర్హేతుకత నుంచి, అతార్కికత నుంచి చూశానా? అందీ అందని, అర్ధాంతరమైన, అర్థరహితమైన, అంతరార్ధమైన దర్శనాలు నన్ను స్పర్శించినపుడు పులకించి రాశానా? ఎన్నిసామాజిక సిద్ధాంతాలున్నప్పటికీ మనిషి సమాజంలో తప్పిపోయి, సమాజాలు గ్లోబల్ సంతల్లో తప్పిపోయి, సామాజిక రాజకీయ వ్యవస్థలు వ్యాపారాల్లో తప్పిపోయి, వ్యాపారాలు యుద్ధాల్లో తప్పిపోయి, అంధయుగాల మనిషే ఇప్పుడూ రాజ్యమై నోట్లో అణ్వస్త్రం, కడుపులో కంప్యూటర్, ఛాతీలో చచ్చిన సముద్రం, ఓ చేత్తో శాటిలైట్, ఇంకో చేత్తో రిమోట్ పట్టుకుని, వళ్లంతా పేటెంట్ బ్రాండ్ ముద్రలతో దేనికోసం వెతుకుతున్నాడో తెలుసుకోడానికి రాశానా? ఏమో నాకు తెలీదు. మనిషి లోపలా బయటా విస్తరించిన ప్రేమతత్వం కోసం రాశానా! ప్రేమను పంచే అవధూతలను అర్థం చేసుకునే ప్రయత్నంలో రాశానా? అదీ కావచ్చు. మానవ మానవేతర అనుభవాలు ఒక అంతిరిక భాషలో నా నుంచి మాట్లాడీ ఉండొచ్చు. ఇంత వేదాంతం ఏమీ లేకుండా సింపుల్‌గా వేపచెట్టు కింద జోలిపట్టి కవిత్వ భిక్షాందేహి అన్నానా? అదీ కావచ్చు. అదే కావచ్చు. నాకయితే అదే ఇష్టం. ఏదైనా మూలం కవిత్వమే. జోలెపట్టా.. జోలి దులిపి ఈ కవితలు రాల్చా అంతే!

Additional information

Weight 0.5 kg
Dimensions 11 × 11 × 11 cm
Shipping Time

2-3 Days

Reviews

There are no reviews yet

Only logged in customers who have purchased this product may leave a review.