Description
Rendella Padnaalugu
Collection of Short Stories by
Madhuranthakam Narendra
యీ సంపుటంలోని కథలన్నీ దాదాపుగా రెండేళ్లలో రాసిన పద్నాలుగు కథలు. రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతంలోనే రెండేళ్లలో రాసిన పద్నాలుగు అనే అర్థంగూడా దాగుంది. యేడు అనే మాటకు ఆయుష్షు అనే మరో అర్థం కూడా వుందని తెలిసాక రెండేళ్ల పద్నాలుగు అనే గుణింతపు మాటకు మరిన్ని అర్థాలు పుడతాయి. సాదాసీదాగా కనిపించే జీవన శకలాలను జాగ్రత్తగా చూడగలిగితే జీవన చలనసూత్రాలను కనిపెట్టడం అసాధ్యమేమీగాదు. అలాంటి ప్రయత్నమొకటి యీ కథల్ని యిలా రూపొందించిందని సహృదయులైన పాఠకులకు ముందుగానే మనవి చేస్తున్నాను.
2000వ సంవత్సరంలో తిరుపతిలో యిల్లు కట్టుకున్నప్పుడు దాదాపు రెండేళ్లపాటూ నేనీ శ్రామికులతో సన్నిహితంగా గడపగలిగాను. భౌతిక శ్రమే పెట్టుబడిగా జీవించే శ్రామికుల జీవితాలు, మధ్యతరగతి వైట్ కాలర్ వుద్యోగుల జీవితాల్లా సంక్లిష్టంగా గాకుండా, చాలావరకూ పారదర్శకంగా వుంటాయని నాకప్పుడే తెలిసింది. యింటిపనులు ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకూడా చాలా సంవత్సరాలపాటూ వాళ్ళ జీవితాల్లోని వైచిత్రి నన్ను వెంటాడింది. సమాజపు పునాదుల్లోనే మిగిలిపోయిన యీ శ్రామికుల శ్రమైక జీవన సౌందర్యానికి (!) నివాళిగా నేనీ కథల్ని మాత్రం రాయగలిగాను.







Reviews
There are no reviews yet